Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట్, శంభీపూర్, భౌరంపేట్ ప్రాంతాల్లో భవిష్యత్తులో ప్రజలకు ఎదురయ్యే ట్రాఫిక్‌ను దష్టిలో పెట్టుకొని సమస్య లేకుండా జంక్షన్ల అభివద్ధి, రోడ్డు వెడల్పు పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు విచ్చేసిన హెచ్ఎండీఏ అధికారులతో కలిసి మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడే ఈ ప్రాంతాల్లో జంక్షన్ల అభివద్ధితో పాటు రోడ్డు వెడల్పు పనులకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సరైన ప్రణాళికతో నిజాంపేట్ కమాన్ నుంచి బాచుపల్లి వరకు రోడ్డు వెడల్పు, జంక్షన్ అభివద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. మల్లంపేట్ గ్రామంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్డును ఆ శాఖ వారు మార్కింగ్ చేసి హెచ్ఎండీఏ శాఖకు అప్పగించాలన్నారు. అలాగే శంభీపూర్, భౌరంపేట్ గ్రామంలోని బొడ్డురాయి వరకు చేపట్టాల్సిన రోడ్డు వెడల్పు పనులపై అధికారులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. చివరగా మల్లంపేట్ గ్రామం వద్ద ఓఆర్ఆర్ మధ్య ఎగ్జిట్, ఎంట్రీ ఏర్పాటును పరిశీలించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివద్ధికి సహకారం అందిస్తూ, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి కేటీఆర్‌కి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఈఈ అప్పారావు, డీఈ దీపక్ కుమార్, ఆర్అండ్డీ డీఈ రాజు, ఏఈ దరణిధర్ రెడ్డి, డీఈ సుబ్రహ్మణ్యం, కమిషనర్ భోగేశ్వర్లు, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్, భౌరంపేట్ పీఏసీఎస్ చైర్మెన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు విజయలక్ష్మి, ఆగంపాండు, కొలన్ వీరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కష్ణ, శంకర్ నాయక్, అనంత స్వామి, మాదాస్ వెంకటేశం, కో-ఆప్షన్ సభ్యుడు సలీం, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, మురళి యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నార