Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
కొంతమంది స్థానికుల డమ్మీ పేర్లతో దండమూడి ఎస్టేట్ వారు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నార న్నారని అల్వాల్ సర్కిల్లోని పాకాలకుంట ప్రాంతం లో 50 ఎకరాల భూమిపై స్టేటస్కో తెచ్చారని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133వ డివిజన్ జొన్నబండ ప్రాంతంలోనీ ఎమ్మెస్సార్ కాలనీలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండమూడి ఎస్టేట్ వారు పాకాలకుంట జొన్నబండ ప్రాంతంలోని సర్వే నంబర్లు 575, 580 భూములు మావే అంటూ కోర్టు నుండి స్టేటస్కో తెచ్చి ఓ పత్రికలో ప్రచురిం చడంతో స్థానిక కాలనీలవాసులు తనను సంప్రదిం చారని ఎమ్మెల్యే తెలిపారు. 1996 సంవత్సరంలో మహమ్మద్ జిలాని నుండి వీరు కొనుగోలుచేశారని 2005లో ఎల్సిల ద్వారా ప్రభుత్వానికి రుసుము చెల్లించి తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అనంతరం ఎల్ఆర్ఎస్ కూడా కట్టారని ఆయన పేర్కొన్నారు. అయితే కొందరి స్థానికుల పేర్లతో మ్యాచ్ఫిÛక్సింగ్ చేసుకొని హైకోర్టు ద్వారా స్టేటస్కో తీసుకురావడం జరిగిందని,స్టేటస్కో అనగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఎలా ఉన్నది అలానే ఉండా లని ఆయన తెలిపారు. అయితే దీంతో భయభ్రాం తులకుగురైన కాలనీ అసోసియేషన్ వారు ఆయ నను సంప్రదించారని, వారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించామని వెల్లడించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ భూకబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడితేే ఎలాంటి వారినైనా సహించేది లేదని, కాలనీవాసులకు ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమహిపాల్రెడ్డి, పరిసరాల కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.