Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ - హస్తినాపురం
మాజీ కేంద్ర మంత్రి డా.శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎల్.బి నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం బొమ్మిడి లలిత గార్డెన్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు హాజరయ్యి ఆ మహనీయుడి ఘనతను వివరించారు. ఈ కార్యక్రమంలో బండి సంజరు మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు భారతీయ జాతీయ వాదాన్ని బలంగా వినిపించిన నేతల్లో ప్రముఖుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. దేశంలో ఒకే పౌరసత్వం, కాశ్మీర్లో అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం విశేషంగా కషిచేసి దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. 23 జూన్ (బలి దాన్ దివస్) రోజుగా ఆ మహానేతకు వనస్థలిపురం బొమ్మిడి లలిత గార్డెన్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించారు. శ్యాంప్రసాద్ దేనికోసమైతే బలిదానం చేశారో అదే ఆశయసాధన కోసం 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసింది' అని బండి సంజరు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదరి ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కళ్లెం రవీందర్ రెడ్డి, శ్రీరాములు యాదవ్, గ్యానేంద్ర ప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్, వంగ మధుసూదన్ రెడ్డి రెడ్డి, ధీరజ్ రెడ్డి , కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కొప్పుల నరసింహారెడ్డి, మొద్దు లచ్చి రెడ్డి, నవ జీవన్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నరసింహగుప్తా, చింతల్ అరుణ సురేందర్ యాదవ్, రాధా ధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, అంజాన్, ముఖ్య నాయకులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కొత్త రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.