Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సంబం ధించిన 70 ఏళ్ల కల డెబ్భై రోజుల్లోనే సహకారం అయిందని బీజేపీి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం ముషీరాబాద్ బీజేపీి క్యాంపు కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ భారత్‌లో విలీనమైన జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం మొట్టమొదటి ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు పార్లమెంట్ చరిత్రలో చరిత్రాత్మకమైన దినంగా నిలిచిపోతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 70 రోజుల్లో సాధ్యం చేసి చూపించిందని అన్నారు. ఈ నిర్ణయంతో జనసంఫ్‌ు వ్యవస్థాపక నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశ తొలి ప్రధాని సర్దార్ వల్లభారు పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి వంటి మహనీయుల స్వప్నం సాకారం అయిందన్నారు. మోడీ సర్కార్ తీసుకున్న ఒకే జెండా, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే సాహసోపేతమైన నిర్ణయం జాతీయ సమగ్రతను బలపరచి అఖండ భారత్ కలిగించేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, పావని వినరు కుమార్, రవి చారి, రచన శ్రీ, సునిత ప్రకాష్ గౌడ్, ముషీరాబాద్ బీజేపీి కన్వీనర్ రమేష్ రామ్, బీజేపీి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి గుండగోని భరత్‌గౌడ్, బీజేవైఎం సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి మద్దూరు శివాజీ, నాయకులు వెంకటయ్య, పూస రాజు, ఉపేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు