Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 చోట్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
నవతెలంగాణ-దుండిగల్
కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి బ్లాక్ డైమండ్వద్ద హరితహారం కార్యక్రమంలో రూ.4.50 లక్షలతో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 18వ డివిజన్లో రూ.50లక్షలతో, బొల్లారం జంక్షన్ నుంచి కల్వర్టు వరకు సీసీ రోడ్డు, 20వ డివిజన్ జయదీపిక కాలనీలో రూ.45లక్షలతో నాలా స్లాబ్స్ నిర్మాణ పనులు, 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు, 32వ డివిజన్లో రూ.12.50 లక్షలతో ఆర్జికే పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, చిల్డ్రన్ గేమింగ్ హౌస్, 31, 32, 33వ డివిజన్లలో రూ.78లక్షలతో ఆర్జికే సర్వీస్ రోడ్డువద్ద అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.