Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ టీఆర్టీఎస్ఏ ప్రతినిధులు బాలిగ సతీష్, వై.రాజేశ్వర్‌లు బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దాదాపు 350 గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల మనుగడకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి)కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా టైపింగులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత అవసరమని నిబంధన విధించేలా సాంకేతిక విద్యాశాఖ అధికారులను ఆదేశిం చాలన్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థుల్లో వత్తి నైపుణ్యం పెరుగుతుందని వారు వివరించారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో టైప్ రైటింగ్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని కోరారు. సిబిటి సిలబస్ టైప్ రైటింగ్ సిలబస్ ఓకే విధంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు లోయర్ మాన్యువల్ గాను, హయ్యర్ కంప్యూటర్ బేస్ ద్వారాను పొందేలా నిబంధనలు రూపొందించేందుకు తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తమ అసోసియేషన్ గౌరవ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి అండదండలతో సమస్యల పరిష్కారం కోసం గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నామని వారు వివరించారు. కాగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే సాంకేతిక విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.