Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి బాపూజీ నగర్‌కు చెందిన రెండు పొదుపు గ్రూపులకు బుధవారం నాడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి మంజూరు ఆయన రుణాలు అందజేశారు. సిరి పొదుపు సంఘం శ్రీలలితా దేవి సంఘానికి మంజూరైన నాలుగు లక్షల రురుణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఎదగడానికి కోసం రుణాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మహిళా గ్రూపులుచే రుణాలు పొంది స్వయం ఉపాధి చేసుకుంటున్నారని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సంఘాల వారు ఆ నిధులతో స్వయం ఉపాధి చేసుకోవాలని కోరారు. బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో దీప, లక్ష్మీ కల్పన, సౌజన్య, పద్మ, సరస్వతి, నాగమణి, ప్రవీణ, నవీన, హరికష్ణ పాల్గొన్నారు.