Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నియోజకవర్గంలో ఇప్పటికే నిర్మాణం అయిన డబుల్ బెడ్ రూములు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి అర్హులకే అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీపీిఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీిఐ(ఎం) జిల్లా నాయకులు బి.వెంకట రామయ్య మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత కార్మికులు, నెలవారి అద్దెలు కట్టలేని పరిస్థితిలో చాలామంది కటిక దారిద్య్రంలో జీవనం గడుపుతున్నారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూములు అర్హులైన వారికే చెందే విధంగా చర్యలు తీసుకొని అందజేయాలని బాచుపల్లి సీపీిఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల దష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ(ఎం) మేడ్చెల్ జిల్లా కమిటీ సభ్యులు బి.వెంకటరామయ్య, మండల నాయకులు బాలపిర్, వీరన్నస్వామి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.