Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుక వారంలో యునైటెడ్ సింగర్స్ చారిటబుల్ ట్రస్ట్ (యుఎస్‌సీటీ)తో భాగస్వామ్యం చేసుకుని దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన సంగీత కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చింది ఫేస్బుక్. ఈ కాన్సర్ట్ ద్వారా అవగాహన మెరుగుపరచడం తో పాటుగా ఇబ్బందులు పడుతున్న సంగీత కళాకారులు, గాయకులకు సహాయమందించేందుకు నిధులనూ సమీకరి ంచనున్నారు. జీవీ ప్రకాష్, కార్తీక్, రఘు దీక్షిత్, సీన్ రోల్డన్, రాజేష్ వైద్య, హరిచరణ్, శ్రీనివాస్ సహా 50 మందికిపైగా పాల్గొననున్నారు. జూన్ 22 నుంచి జూన్ 26వ తేదీ వరకూ వాయిస్ శీర్షికన నిర్వహించబోతున్న కాన్సర్ట్‌లో ఈ కళాకారులు తమ ప్రదర్శన అందించనున్నారు. ఇది ఫేస్బు క్‌పై నిర్వహిస్తోన్న లైవ్ ఇన్ యువర్ లివింగ్ రూమ్ కాన్సర్ట్ల సిరీస్‌లో భాగం. ఒన్ వాయిస్ కాన్సర్ట్, జూన్ 22, మంగళవారం నుంచి జూన్ 26, శనివారం వరకూ సాయం త్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ యుఎస్‌సీటీ ఫేస్బుక్ పేజీపై, సంబంధిత కళాకారుల ఫేస్బుక్ పేజీల పై జరుగుతుంది. ఫేస్బుక్ ఇండియా మీడియా పార్టన ర్షిప్స్ డైరెక్టర్ పరాస్ షరామ్ ఈ సందర్భంగా మాట్లాడు తూ భారతీయ సంగీత పరిశ్రమ నుంచి భాగస్వాములతో తాము కలిసి పనిచేయడం ద్వారా వినూత్నమైన సామాజిక అనుభవాలను నిర్మించడంతో పాటుగా ద్వితీయ క్షణాలను పంచుకునే విధానంలో కూడా సంగీతాన్ని తీసుకువస్తున్నా మన్నారు. ఎంతోమంది ప్రజలు తమ వేదికలపైకి రావడం తో పాటుగా ఒకరికొకరు సహాయపడుతుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం కోసం యునైటెడ్ సింగర్స్ చారిటబుల్ ట్రస్ట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల తాము ఆనందంగా ఉన్నామన్నారు. యునైటెడ్ సింగర్స్ చారిటబుల్ ట్రస్ట్ , ఫౌండర్ ట్రస్టీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫేస్‌బుక్‌తో తమ భాగస్వామ్యం ఎల్లప్పుడూ విలువైనదేనన్నారు.