Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్టు హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివా స్రావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, కృష్ణవేణినగర్, సాయి ప్రశాంత్‌నగర్ ఫేజ్-2 కాలనీ ల్లో ప్రజా సమస్యలపై ఆయన పాదయాత్ర నిర్వహించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీల్లో వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ న్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న వీధి దీపాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాన న్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత సుఖవంతమైన మెరుగైన రవాణా సౌకర్యం కోసం సాయశక్తుల కృషి చేస్తానన్నారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీ సీఎల్ ఏఈ రాజు, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీవాసులు రాజుసాగర్, రేణుక, వాసు, శేఖర్, వెంకటేష్, స్వామి, కుమార్, వెంకటేశ్వరరావు, గాల య్య, మన్నెం, ఇందిర, జయదేవ్, మల్లేష్ పాల్గొన్నారు.