Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జులై 13న బల్కంపేటలోని ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, రోడ్డు, భవనాలశాఖ, ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ, విద్యుత్ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది కరోనా కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించామని చెప్పారు. ఈసారి ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కల్యాణాన్ని నిర్వహిస్తామన్నారు. జులై 12న ఎదుర్కోలు, 13న అమ్మవారి కల్యాణం, 14న రథోత్సవం ఉంటాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కోవిడ్ రూల్స్‌ను పాటిస్తూ ఏర్పాట్లు చేస్తామన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్శనానికి, ఆలయానికి వచ్చే రోడ్లను మరమ్మతులు చేపట్టాని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మొబైల్ టాయిలెట్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, ఆలయాన్ని అందంగా అలంకరించాలని, భక్తులకు పంచేందుకు లక్ష వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మిబాల్‌రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈవో అన్నపూర్ణ, కల్చర్ డైరెక్టర్ హరికృష్ణ, డీసీ వంశీ, వాటర్‌బోర్డు డైరెక్టర్ కృష్ణ, వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్, ఆర్అండ్బీ ఈఈ శ్రీనాథ్, ట్రాన్స్‌కో డీఈ నెహ్రూ నాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యుగంధర్, ఆర్డీఓ వసంత కుమారి, సమాచార శాఖ ఇంజనీర్ రాధా కృష్ణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
తలసాతలసతతలసాని లసాని ాని