Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పెద్ద అంబర్ పేట మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు స్వాగతమిస్తున్నాయని, ఇప్పటికీ పరిస్కారం కానీ సమస్యలు కోకొల్లలని కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ అన్నారు. బుధవారం పెద్ద అంబర్ పేట మున్సిపల్ కుంట్లూ ర్ లోని రావి నారాయణరెడ్డి కాలనీ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయి సిబ్బంది లేక పాలన స్తంభించి, ప్రజా సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టీపీఓ లేక పట్టణ పరిధిలోని అనేక నిర్మాణ రంగంలో రెండున్నర ఏండ్లుగా ఫైల్లు పెండింగులో ఉన్నాయని, ఆసరా పెంచన్లు గురించి పట్టించుకునే వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికీ నిర్మించిన మరుగు దొడ్ల బిల్లులు చెల్లించలేదని, హరితహారం మొక్కలకు సంబంధించిన వాటి వివరాలు గోప్యంగా ఉంచుతూ, ఎల్ఆర్ఎస్ ద్వారా రావాల్సిన ఆదాయం, మున్సిపల్ ఆర్థిక వనరులు విషయాలు తెలియజేయడం లేదన్నారు. అత్యధిక పేదలు ఉన్న ఆర్ కె నగర్, రావి నారాయణరెడ్డి కాలనీ, కళా నగర్, తదితర కాలనీపై నిర్లక్ష్యం వహిస్తూ, గేటెడు కమ్యూనిటీ కాలనీలకు ప్రాముఖ్యతనిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు కషి చేస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజల అభివద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ ఇతర ప్రత్యేక నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తూ, ఆయా వర్గాల ప్రజల కు వినియోగించకుండా మున్సిపల్ జనరల్ ఫండ్ తో కలిపి అన్ని వార్డులకు సమాన నిధులు విడుదల చేస్తూ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అతిక్రమిస్తున్నారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. . పట్టణ అభివద్ధిలో అందరూ భాగస్వామ్యంగా వ్యవరిస్తూ గ్రూప్ రాజకీయాలకు స్వస్తి చెప్పి పుర పాలక సంఘం అభివద్ధి కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.