Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా సమావేశంలో రైతుల ఆవేదన
నవతెలంగాణ - హైదరబాద్
తమ భూమిలోకి తమనే రానియ్యకుండా గుండాలతో దాడిచేయించడంతో పాటు మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని వెంకటాపూర్ రైతులు చింతపంటి ధానయ్య, చింతపంటి సత్తయ్య, చింతపంటి జంగయ్య, లింగం, సాయికుమార్, తదితర రైతులు పట్టా భూమిలో తమ పాసుపుస్తకాలు చూపిస్తూ విలేకర్ల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 820, 821, 822, 823, 824, 825లలో 30 మంది రైతులకు దాదాపు 103 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత భూమిని 15 సంవత్సరాల క్రితమే డెవలప్ మెంట్‌కు ఇవ్వగా, మిగిన 50 ఎకరాల భూమి తమదేనంటూ ఓ న్యాయవాది బెదిరింపులకు పాల్పడుతున్నారని, బుధవారం రైతులు తమ పాసుపుస్తకాలు చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమిలో గొర్రెలు, మేకలు, బర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమ భూమిపైనే తమకు ఎలాంటి హక్కూ లేదని సదరు న్యాయవాది తమను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర సౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు తాము భూమిని విక్రయించామని, డౌట్ ఉంటే తమ కార్యలయానికి రావాలని ఆ న్యాయవాది ఆదేశిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.