Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందవరకు వ్యాక్సిన్ కేంద్రాల పెంపు
- ఇప్పటి వరకు 9,85,930 మందికి వ్యాక్సినేషన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, వైద్యారోగ్యశాఖలు ప్రత్యేక దృష్టిసారించాయి. గ్రేటర్లోని పలుప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి మరో 23 మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలోని 23 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మొబైల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ ద్వారా ప్రతిరోజూ 300 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి రోజు 6, 900 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అమీర్పేట్లో ఏర్పాటు చేసిన మొబైల్ సెంటర్కు భారీగా జనం తరలివచ్చారు.
వంద కేంద్రాలుసిటీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 100 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 60 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత 40 కేంద్రాలతో కలిపి వందకు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే 51 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 9,85,930 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులతోపాటు గ్రేటర్లోని చిరువ్యాపారులకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. తర్వాత గ్రేటర్లోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలను జులై ఫస్టు నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రయివేటు, ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.