Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
పెట్రోల్ డిజిల్ గ్యాస్‌ల ధరలు తగించాలని కోరుతూ గురువారం మండలంలోని అంకుషాపూర్ హెచ్‌పిసిఎల్ ముందు సీపీఐ(ఎం), సీపీఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య, సీపీఐ జిల్లా నాయకులు కల్లురి.జయచంద్ర మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి నాయకత్వంలో దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీిజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు సాధారణ ప్రజల గృహ బడ్జెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. గత 46 రోజుల్లో 26సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దంపడుతుందని విమర్శించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని వామపక్షల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆదోళనలు జరుగుతు న్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో ఆదోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరలేపడం అప్రజాస్వామికమని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మితే తీవ్రంగా వ్యతిరేకించిన టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పడు భూములు కార్పొరేట్ శక్తులకు అమ్మడం ఘోరమన్నారు. ఈ కార్యాక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఎన్.సబిత, కడమంచి యాదగిరి, పరమేష్, సునీత, అరుణ, హాసీనా, రమేష్, సీపీిఐ నాయకులు ఈశ్వర్, అన్వర్, భాష, నరసింహా, ఎస్.యాదయ్య, చౌదరి, సోమన్న, ప్రభావతి పాల్గొన్నారు.