Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మండలంలో అన్ని గ్రామాలలో ప్రజలకు నీటి సమస్యలు లేకుండా పరిష్కరించనున్నట్లు ఎంపిపి ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండలపరిషత్ కర్యాలయంలో గురువారం జలమండలి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవుటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామలలో మిషన్ భగీరథó నీరు ప్రతి ఇంటికి ఇవ్వకపోవడంతో సంవత్సర కాలంగా పలుమార్లు సమావేశాలు ఏర్పటు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రజాయోనం లేకపోవడం బాధాకరమన్నారు. చౌదర్‌గూడ గ్రామంలో 3000లకు పైగా ఇండ్లకు మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీి మిషన్ భగీరథó ద్వారా నల్ల కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పినా ఆధికారులు స్పందిచకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ పంచాయితీ పాలకవర్గాలు తీర్మానాలు చేసి పంపినా పట్టించుకోకపోవడం ఈ విషయం పై మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అరుణరెడ్డి, జలమండలి డీఈ కార్తక్రెడ్డి, వైస్ ఎంపిపి కర్రె జంగమ్మ, చౌదర్‌గూడ సర్పంచ్ భైరు రమాదేవి, రాములుగౌడ్, ఎంపిటిసి సభ్యులు పులకంటి భాస్కర్‌రెడ్డి, నీరుడి.రామారావు, తదితరులు పాల్గొన్నారు.