Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
ఫ్రీ వాటర్ స్కీం ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తారని జీహెచ్ ఎంసీి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రరావు హామీలు తుంగలో తొక్కారని బీజేపీ ఆధ్వర్యం లో వాటర్ గ్రిడ్ డీజీఎం సాంబయ్యకు మెమోరాండం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత సంవత్సరం డిసెంబర్లో బల్దియా ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీి 20వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. మార్చి 31లోపు ప్రతి ఇంటికి నల్లాకు ఆధార్ లింకు చేసుకోవాలని, దీనితో పాటు మీటర్ పని చేస్తేనే పని చేస్తుందని ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఇందులో భాగంగా వాటర్ బోర్డు కేవలం కొన్ని ఇండ్లకు మాత్రమే ఆధార్ లింకు వచ్చేసింది. వాటర్ బోర్డు ప్రతి ఇంటికీ, ,ప్రతి అపార్ట్మెంటుకు ఆధార్ లింకు చేయాలని మీటర్ ప్లాట్ వివరాలు నమోదు చేయాల్సింది కానీ వాటర్ స్కీమ్ సుమారు 20 వేల మాత్రమే ఆధార్ లింక్ అయింది. కొత్త మీటర్లు లేవని తర్వాత ప్రజలకు అధికారులు బిల్లులు జారీ చేయడం జరిగింది ఇంటి యజమానులు గద్దెలపై వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుందని ఎంతో మంది యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటియజమానులు ఆధార్ లింకు చేసుకోలేదని దీంతో వాటర్ బోర్డు ఆరునెలల పెండింగ్ బిల్లులు ఒకేసారి ఇస్తుండడంతో ఆ భారం కిరాయికి ఉండే వాళ్ల మీద పడి బిల్లులు వసూలు చేస్తున్నారని కొంతమందికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు ఈ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు నెరవేర్చాలని కొంతమందికి ఆధార్ లింకు లేదని మీటర్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు అధికారులు ఆ పెండింగ్ బిల్లులను వెంటనే ఉపసం హరించుకోవాలని ప్రజలం దరికీ ప్రతి కనెక్షన్‌కు ఆధార్ లింకు నిబంధనలకు లోబడి బిల్లులు జారీ చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున యాదవ్, అనిల్, రాజ్, శ్రీనివాస్, అమర్, ఆనంద్ మల్లికార్జున్ గౌడ్, గణేష్, శ్రీనివాస్ గుప్తా, ప్రతాప్ రెడ్డి బీజేపీ మహిళా నాయకురాలు రాజేశ్వర్ రెడ్డి, ప్రతిభ రావు పాల్గొన్నారు.