Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్లంటూ ఆకర్షణ
- గోల్డ్ ట్రేడింగ్ పేరుతో లక్షలు వసూలు
- ఐటీ యాక్టు కింద కేసునమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొందరు కాయిన్స్, గోల్డ్ ట్రేడింగ్, సిల్వర్ ట్రేడింగ్ పేరుతో ఆన్లైన్ పెట్టుబడులు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై రాచకొండ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ఇందులో భాగంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, చెక్బుక్స్తోపాటు 13 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు వెస్టు ముంబారుకి చెందిన మయూర్ శారద్ హడ్కర్ 'డిజి వ్యాల్యూషన్ కంపెనీ లిమిటెడ్'కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ ముంబారుకి చెందిన గుడు వినోద్ శర్మా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ముంబారులో నివాసముంటున్న సింగపూర్‌కు చెందిన ఫిలిప్ చాన్, ముంబారుకి చెందిన విజరు చుట్లాతో కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. గుజరాత్లో 'విక్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబారులో డిజి వాల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫాన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ములియా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌ల పేరుతో ఆన్లైన్ మార్కెటింగ్‌ను సృష్టించారు ఆన్లైన్లో బంగారం అమ్మకాలు, కొనుగోలు చేయవచ్చని ప్రచారం చేశారు. వాట్సాప్‌లో గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ చేయవచ్చని, గోల్డ్ కైన్స్ పేరుతో ప్రజల్లో నమ్మకాన్ని కల్పించారు. వాటిల్లో పెట్టుబడులు పెట్టాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వారికి ఐడీలు, పాస్వార్డ్స్ పంపిస్తున్నారు. వెబ్సైట్ లింక్‌తో వ్యవహరాన్ని కొనసాగించారు. రోజుల వ్యవధిలోనే లక్షలల్లో సంపాదించ వచ్చని నమ్మిస్తున్నారు. ఎంతో మంది సంపాదించినట్టు వెబ్సైట్లో క్లాస్‌లు పెట్టి చూపిస్తున్నారు. డబ్బులు పెట్టిన వారికి విత్‌డ్రా ఆప్షన్ లేకుండా చేశారు. కానీ వారికి ప్రాఫిట్ వచ్చిందని ఆన్లైన్లో చూపిస్తున్నారు. వీరి మాటలను నమ్మిన కొందరు బాధితులు ఆన్లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు కట్టారు. నెలల తరబడి డబ్బులు విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. డీసీపీ యాదగిరి ఆదేశాలతో ఏసీపీ హరినాథ్ సూచనలతో ఇన్స్పెక్టర్ పి.లక్ష్మికాంత్ రెడ్డి విచారణ కొనసాగించారు. నిందితులపై ఐటీ యాక్టు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ అన్ని కోణాల్లో విచారించి ఇద్దరు నిందితులను ముంబారులో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. నిందితులకు సంబంధించిన కోటాక్ మహేంద్ర, ఐసీఐసీఐసీ బ్యాంక్, యస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇద్దరు నిందితులు రూ.12లక్షలపైగా డబ్బులను దండుకున్నారని సీపీ తెలిపారు. పరారీలో వున్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. ఛాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇన్వెస్ట్ చేసేముందు ఆలోచించాలి : సీపీ
సులువుగా డబ్బులు సంపాదించాలని కొన్ని ముఠాలు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటు న్నాయనిరాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపారు తాజాగా వివిధ ట్రేడింగ్‌ల పేరుతో ఇన్వెస్టులు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా కాయిన్స్, బంగారం, సిల్వర్ ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ అని ఆశచూపిస్తే అలాంటి వారిని నమ్మొద్దన్నారు. వివిధ ట్రేడింగ్‌లతో తక్కువ సమయంలో అధిక లాభాలోస్తాని సూచిస్తే అనుమానించాలని రాచకొండ సీపీ తెలిపారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.