Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకీకరించి అంబర్‌పేట నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్లోని సాయిబాబా గుడి లేన్, భారతీయ విద్యాభవన్ స్కూల్ లేన్లలో రూ.7 లక్షల 35 వేల అంచనా వ్యయంతో చేపడుతున్న డ్రయిౖనేజీ పైపులైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర చేపట్టి స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైమాస్ట్ లైట్లు, లోప్రెషర్ నీటి సరఫరాపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన సమస్యలైన డ్రయినేజీ, మంచినీటి పైపులైన్, రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరించి అంబర్‌పేట నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, వర్క్ ఇన్స్పెక్టర్ అక్ష్వాక్, టీఆర్ఎస్ నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్. బి.లింగంగౌడ్, అర్.కె.బాబు .భరత్‌రాజ్, లక్ష్మణ్, రాము, నర్సింగ్ యాదవ్, కొమ్ము శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, ప్రభాకర్, శ్రీను, వెంకట్, సంతోష్, ధనలక్ష్మి, ఉమ, లక్ష్మి, పల్లవితో పాటు బస్తీ వాసులు శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సంతోష్, రామారావు, డా.వహీద్, వాసు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.