Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
బోలక్ పూర్ డివిజన్లో రోడ్డు విస్తరణ, డ్రయినేజీ వాటర్ వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. గురువారం డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రయినేజీ వాటర్ వర్క్ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థలో చేరడంతో రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా డ్రయినేజీ పైప్లైన్ ఆధునీకరించి రోడ్డు పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ అలీ, నాయకులు వై శ్రీనివాస్, మచ్చ కుర్తీ ప్రభాకర్, చాంద్, తదితరులు పాల్గొన్నారు.