Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందశాతం విధులకు హాజరు
- జులై 1నుంచి విద్యార్థులకు పాఠాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరుకానున్నారు. దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత ఉపాధ్యాయులు బడి బాట పట్టనున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 5600 మంది టీచర్లు, 400 మంది నాన్ టీచింగ్ సిబ్బంది శుక్రవారం విధులకు హాజరు కానున్నారు. ఆ దిశగా ఆయా పాఠశాలలను శానిటైజేషన్ చేసి అందు బాటులోకి తీసుకురానున్నారు. జూలై 1నుంచి 8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు లేదా ఆన్లైన్ క్లాసులు వినవచ్చు. ఈ నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్ల టీచర్లు చూడనున్నారు. అలాగే రికార్డుల పరిశీలన, విద్యార్థుల అప్గ్రేడ్, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై దృష్టిసారిస్తారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు 1420 ఉండగా.. వీటిలో సుమారు 10వేలకుపైగా టీచర్లు ఉన్నట్టు సమాచారం. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు విధిగా నేటి నుంచి విధులకు హాజరు కావాలని, తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టాలని.. లేనిపక్షంలో వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈవో ఆర్.రోహిణీ హెచ్చరించారు.