Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాలీబాల్, మహిళల బ్యాడ్మింటన్ కోర్టు, క్యాంటిన్ ప్రారంభించిన సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
విధుల్లో నిత్యం బిజీగావుండే పోలీసులకు పనిఒత్తిడి నుంచి ఉపశమనం, ఉత్సాహం నింపేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఎప్పటికప్పుడు చర్యలను చేపడుతున్నారు. కొద్ది రోజల క్రితం కమిషనరేట్‌లో షెటిల్ కోర్టును ప్రారంభించిన కమిషనర్ గురువారం అంబర్‌పేట్‌లోని కార్ హెడ్‌క్వార్టర్‌లో ఆమ్రిజర్వుడ్ పోలీసుల కోసం వాలీబాల్ కోర్టు, మహిళల కోసం బ్యాడ్మింటన్ కోర్టుతోపాటు క్యాంటిన్‌ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. దేశంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ అతి పెద్దదన్నారు. 5091 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న కమిషనరేట్‌లో సివిల్ పోలీసులతోపాటు ఏఆర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. బందోబస్తు, వీఐపీల ఎస్కాట్తోపాటు వివిధ అంశాల్లో ఏఆర్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాచకొండ కమిషన రట్లో పోలీసుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు.