Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజాసమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎంఎన్రెడ్డినగర్ ఫేజ్ 1 సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి సీసీ రోడ్లు వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతన డ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలనీలలో మిగిలిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు సంపత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌గౌడ్, వర్కింగ్ జనరల్ సెక్రటరీ పరమేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ పరిశీలన
మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణలు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా సీఎం కేసీర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి వేసేందుకు ప్రభుత్వం అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి షెహనాజ్, నాయకులు సురేష్‌రెడ్డి, ఫెరోజ్, వార్డు సభ్యులు సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.