Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫ్రెండ్లీ సీఎంగా కేసీఆర్ అందరికి ఆరాధ్యుడయ్యారని టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ వధాకాకుండా ఉండేందుకు టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నారాయణగూడలోని ఐపీఎంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. నిరంతరాయంగా సేవలందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని, సానిటేషన్ సిబ్బందిని టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఐపీఎంలో ఘనంగా సత్కరించి అభినందించారు. కోవిడ్ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులందరికి మంచిపేరు వస్తుందని అన్నారు. ఉద్యోగులకు ఫ్రెండ్లీ సీఎం ఉండటం మన అదష్టమని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాయకంటి ప్రతాప్, భాగ్యనగర్ టీఎన్జీవోస్ అసోసియేషన్ గొచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఎం.సత్యనారాయణగౌడ్, ఐపీఎం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శివలీల, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ యాకేందర్రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు, బి టిఎన్జీవోస్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.ప్రభాకర్‌రెడ్డి, జి.మల్లారెడ్డి, ఎ.శ్రీనివాస్, ప్రదీప్, అబ్దుల్సాధిక్ తదితరులు పాల్గొన్నారు.