Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్స్ కడిల్స్ వైద్యుల ఆధ్వర్యంలో అరుదైన శస్త్ర చికిత్స
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణలో అత్యంత పిన్న వయస్కురాలైన పాపకు పీడీఏ (గుండెలో రంధ్రం) సమస్య రావడంతో నాన్-ఇన్వేజివ్ క్లోజర్ పద్ధతిలో నయం చేసినట్లు కిమ్స్ కడిల్స్ వైద్యులు తెలిపారు. గర్భం దాల్చిన 28 వారాలకే పుట్టిన ఆ పాప.. ఆ సమయంలో కేవలం 1100 గ్రాముల బరువుంది. సాఫ్ట్వేర్ దంపతులైన అనిత, రాకేష్సింగ్లకు 2021 ఏప్రిల్ 21న కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో పాప పుట్టింది. వాళ్లు హైదరాబాద్ చందానగర్లో నివసిస్తారు. ఏడోనెలలోనే పుట్టడంతో పాప బతికే అవకాశాలు 80-90 శాతం ఉంటాయి. కానీ ఆ పాపకు పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ అనే సమస్య ఉంది. గుండె నుంచి వచ్చే రెండు ప్రధాన రక్తనాళాల మధ్య ఖాళీ ఉంది. అనితకు ప్రసవం చేసిన బృందానికి చెందిన కిమ్స్ కడిల్స్ ఆసుపత్రి చీఫ్ నియోనాటాలజిస్టు డాక్టర్ సి.అపర్ణ మాట్లాడుతూ 'పాప పుట్టినప్పుడు ఆమెకు ఊపిరి ఆడక పోవడంతో మేం ముక్కు ద్వారా సీపాప్ (నాజల్ కంటి న్యువస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్)తో ఆక్సిజన్ అందిం చాం. ఇది శస్త్రచికిత్స లేకుండా ఊపిరితిత్తులకు గాలి అందించే పద్ధతి. తర్వాత పాప నోటి నుంచి గాలిగొట్టం లోకి ఒక ప్లాస్టిక్ ట్యూబును అమర్చాం. అప్పుడు పాప ఊపిరితిత్తులు విచ్చుకోవడానికి మందులు ఇవ్వడం వీలవుతుంది' అన్నారు. కిమ్స్ కడిల్స్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ సుదీప్ వర్మ మాట్లాడుతూ 'పాపకు మూడు రోజుల తర్వాత ఎకోకార్డియోగ్రాఫిక్ స్క్రీనింగ్ చేయగా పెద్ద పీడీఏ ఉన్నట్లు తేలింది. దాంతోపాటు గుండె గోడల్లో పెద్ద వీఎస్డీ (వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్) అనే రంధ్రం కూడా ఉంది. పాపకు 72 గంటల పాటు పారాసిటమాల్ ఇచ్చి, గుండెలో రక్త ప్రసారం జరుగుతున్న తీరును గమనించాం' అని తెలిపారు. ఈ ప్రక్రియలో సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.గౌతమి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ సుదీప్ వర్మ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ అనెస్థీషియాలజిస్టు డాక్టర్ ఆర్. నాగరాజన్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ర డి.అనిల్ కుమార్, చీఫ్ నియోనాటాలజిస్టు డాక్టర్ సి.అపర్ణ, అసోసియేట్ కన్సల్టెంట్-నియోనాటాలజీ డాక్టర్ రితికా ఖరే తదితరులు పాల్గొన్నారు.