Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెచ్చులూడుతున్న పైకప్పులు,
- విరిగిన బెంచీలు
- డోర్లు, నీటిసౌకర్యంలేని టారులెట్లు
నవతెలంగాణుఅబ్దుల్లాపూర్ మెట్
పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకుంటున్న కొన్ని సర్కారు స్కూళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. అసలే అంతంత మాత్రం సౌకర్యాలు కలిగిన పాఠశాలలు లాక్డౌన్, కరోనా సెలవుల కాలంలో మూతపడటంవల్ల అపరిశుభ్రంగా మారిన పరిస్థితి అబ్దుల్లాపూర్మెట్ మండలంలో కనిపిస్తోంది. పాతభవనాలు కలిగిన స్కూళ్ల గోడలకు, పైకప్పులకు పెచ్చులూడిపోయాయి. మరికొన్ని చోట్ల పెచ్చులూడిన పైకప్పు, విరిగిన బెంచీలు దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో టారులెట్స్ ఉన్నప్పటికీ కొన్నిచోట్ల పడావు పడ్డాయి. మరికొన్నిచోట్ల నీటిసౌకర్యంలేకుండా ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల డోర్లు లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కరోనా సెలవుల తర్వాత శుక్రవారం ఆయా స్కూళ్లకు వెళ్లిన టీచర్లకు, స్టూడెంట్లకు ఇటువంటి దృశ్యాలే కనిపించాయి. స్కూళ్లు తెరిచేముందు ప్రభుత్వం, అధికారులు ఇటువంటి సమస్యలు పట్టించుకోరా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కరోనావల్ల స్కూళ్లు మూతపడటంతో పిల్లలు చదువుకు దూరమయ్యారు. తమ పిల్లల భవిష్యత్తుపట్ల ఆందోళనతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆన్లైన్ క్లాసులు నడిచినా వాటిపట్ల ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రులు, పిల్లలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆన్లైన్కంటే.. బడికి వెళ్లి చదువుకునే చదువులే బాగుంటాయని, వాటివల్లే ఉపయోగమని చాలామంది భావిస్తూ వచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పాఠశాలలు జులై ఫస్టు నుంచి తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా ప్రభుత్వ పాఠశాలలకు టీచర్లు హాజరయ్యారు. పాఠశాలలు ఓపెన్ అవుతాయన్న సమాచారంతో తల్లిదండ్రులు, పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్లో తరుణ్ , అక్షర, భార్గవి తదితర టీచర్లు పాఠశాలకు హాజరయ్యారు. ఓ వైపు కరోనా భయం కొంత ఉన్నా పాఠశాలలు తెరవడంపట్ల చాలామంది ఆనంద వ్యక్తం చేస్తున్నారు.