Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్లోని బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు, అసంబద్ధ ప్రేలాపనలు మానుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డిఅన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బీజేపీలో చేరిన రామకష్ణ తీరు ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారంకార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ సభ్యులు పాండు యాదవ్ నలిని వెంకట్రావు ప్రభాకర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కుల మాట్లాడారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రామకష్ణకు అభివద్ధి పనులపైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన మాట్లాడే అర్హత లేదన్నారు. తనకు నామినేటెడ్ పదవి వస్తుందని, ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని ఆశపడుతున్న అదిష్టానం పట్టించుకోలదేన్నారు. దీంతో అతను మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ. 8 కోట్లు తెప్పించలేని అసమర్థతో ఉండి ఇతరులపై బురదజల్లడం ఏమిటని ప్రశ్నించారు. గతేడాది వచ్చిన వరదలను దష్టిలో ఉంచుకుని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తక్షణ నిధుల కింద ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ. 8 కోట్లు కేటాయించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దీంతో పాటు కంటోన్మెంట్ పరిధి నుంచి ప్యాట్నీ నాలా విస్తరించి ఉండడంతో ఇటీవల కాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ అర్బన్డెవలప్ మెంట్ విభాగం ఏప్రిల్ 5వ తేదీన జీఓ నెం.288 ద్వారా ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూపరిపాలన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం ఆధునీకరణకు సంబంధించి టెండర్ దశలో ఉందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ధర్మాలు చేయడం సిగ్గుచేటన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నినా కంటోన్మెంట్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా కంటోన్మెంట్లో బీజేపీ ఆటలు సాగవన్నారు.