Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నవతెలంగాన-తుర్కయంజాల్
టీఆరెస్ ప్రభుత్వం హయాంలోనే అత్యధిక సం క్షేమ పథకాల ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్క యంజాల్ మున్సిపాలిటీ పరిధి మునగనూరు గ్రామా నికి చెందిన పేరుందోరై ఉష కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.51,000వేల చెక్కును లబ్ధి దారులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద లో ఉన్న అభాగ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. కరోన సంక్షోభం లోనూ ఆగకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని, నిరుపేద కుటుంబాలకు ఆప ద్బాంధవుడిగా కెసిఆర్ మారారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, నక్క రమేష్ గౌడ్, నక్క శ్రీనివాస్, దోమలపల్లి మహేందర్, సాదు శీను, వేంకట్ గాంధీ, వై. రాజేష్, కష్ణ గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.