Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్థానిక సంస్థలు గ్రామ పంచాయితీలు,మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు,అభివద్ధి కొరకు గతంలో తీసుకువచ్చిన జి. ఓ.ఎస్. నె.255 ప్రకారం స్థానిక సంస్థల అభివద్ధి కొరకు సినరేజ్ నిధులు కేటాయించడం జరిగినందున సి.ఎం దష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ను తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ఎంపిటిసి లు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపిటిసి లు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్,మల్కాజిగిరి)కి గత కొద్ది సంవత్సరాలుగా రావాల్సిన 533 కోట్లు విడుదల కాలేదన్నారు. 533 కోట్లను విడుదల చేయవలసిందిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని నిధుల విడుదలలో జాప్యము జరగడంతో గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు.2017లో రాష్ట్ర హైకోర్టు 255జి.ఓ. ప్రకారం చట్టబద్ధంగా రావాల్సినటు వంటి నిధులను రెండు నెలల్లో విడుదల చేయవల సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంవత్సరం గడిచినా అట్టి నిధులు విడుదల చేయకపోవడంతో అప్పటి రంగారెడ్డి జిల్లా,జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దష్టికి ఈ విషయం తీసుకెళ్లగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జిల్లాకు చెందిన జడ్పీటీసీలు,స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అసెంబ్లీకి తీసుకెళ్లి అప్పటి ఐ టి శాఖామంత్రి కెటీఆర్, పంచాయితీ రాజ్ మంత్రి జూపల్లి కష్ణారావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి , స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పట్నం నరేందర్ రెడ్డి సుంకరి రాజు అసెంబ్లీలో మీటింగ్ నిర్వహించి రెండు నెలలలోపు నిధుల విడుదల చేయిస్తామని హామీ ఇవ్వ డం జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన అట్టి హామీని మూడు సంత్సరాలు గడుస్తున్నా నేటికి నెరవేరలేదనితెలిపారు. శాసన మండలి సభ్యులుగా ఉన్న మీరు సీఎం దష్టికి తీసుకెళ్లి వెంటనే విడుదల చేయించవలసిందిగా తెలంగాణ పంచాయితీ రాజ్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ముకష్ణ గారు,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పండుగ కవిత గారు,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గుండువారి తిరుపతి అన్న గారు,ఎంపిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి , గోధుమ కుంట ఎంపిటిసి కిరణ్ జ్యోతి పాల్గొన్నారు.