Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజలకు మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పరుస్తానని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని జయభారత్నగర్లో ప్రజలు ఎదుర్కోంటున్న డ్రైనేజీ సమస్యపై హెచ్ఎంటి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ పైపులైన్ పనులపై ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కోంటున్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరుస్తానన్నారు. కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, వాటర్ లైన్ మెన్ సునీల్, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు కృష్ణంరాజు, మహేష్, వుఎంకటేష్, కుమారస్వామి, సూరపనేని గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.