Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపల్ వార్డుల ప్రజలందరి అందరి సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి సమస్యలు పరిష్క రిస్తామని దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ సుంకరి కష్ణవేణి కష్ణ తెలిపారు. శుక్రవారం దుండిగల్ మున్సి పాలిటీ చైర్ పర్సన్ సుంకరి కష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన దుందిగల్ పురపాలక సంఘం కౌన్సిల్ ''సర్వ సభ్య సమావేశం'' నిర్వహించారు. ఈ సమావేశం నందు వివిధ అభివద్ధి పనులకు వివరిస్తూ పరిపాలన అనుమ తులు తెసుకోవడం జరిగినది, ఈ సమవేశం లో పుర పాలక సంఘం నందు కొత్తగా చేపట్టబోయే అభివద్ధి పనులకు 1364.00 లక్షల రూపాయలను కేటాయించి ఆమోదించారు. ఈ సమావేశం కౌన్సిలర్స్ అడిగిన ప్రశ్న లకు చైర్ పర్సన్ సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పనులను వేగవంతంగా పూర్తిచేసి వార్డుల ప్రజలఅందరి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా రు. దుండిగల్ వైస్-చైర్మన్ తుడుము పద్మారావు , ముని సిపల్ కమీషనర్ పి. భోగిశ్వర్లు , కౌన్సిలర్ సుంకరి క్రిష్ణ , అన్ని వార్డ్స్ కౌన్సిలర్స్, మునిసిపల్ మేనేజర్ ఎస్. సున ంద, మునిసిపల్ ఇంజనీర్ పి. ప్రవీణ్ కుమార్, జూని యర్ జె ఏ ఓ రాజబాబు , డిప్యూటీ తహసిల్దార్ సుధాకర్ , మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.