Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం గాజులరామారం సర్కిల్ గాజులరామారంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యాక్సిన్ ప్రక్రియను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ అందరికి అందేలా చూడాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నారన్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు తొలగించి అందరికి వ్యాక్సిన్ అందేలా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం ఓక్షిత్ ఎన్క్లేవ్కాలనీలో ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జి వర్ధంతి వేడుకల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్‌రెడ్డి, కేకేఎం ట్రస్టు చైర్మెన్ కూన శ్రీనివాస్‌గౌడ్, నాయకులు నందనం దివాకర్, నాయకులు రవి, బక్క శంకర్‌రెడ్డి, ఎంఎస్.వాసు, పలు డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నార