Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవేత్తల భూదాహం
- నాలా ఆక్రమణతో కుంచించుకుపోతున్న బఫర్‌జోన్
- వానాకాలంలో కోతకు గురవుతున్న బొందలగడ్డ
- కాపాడాలని స్థానికుల వినతి
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని దాయార్గూడ దళితుల శ్మశాన వాటిక క్రమంగా ఇక్కడి పరిశ్రమ యజ మానుల కబ్జాలకు గురవుతోంది. ఓ వైపు పారి శ్రామిక వేత్తల ఆక్రమణ, మరోవైపు నాలా ఉండ టంతో శ్మశాన వాటిక జాగా రోజు రోజుకూ కుంచించుకుపోతోందని దాయార్ గూడ వాసు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలో దాయార్గూడ దళితుల శ్మశాన వాటిక ఉంది, అయితే పరిశ్రమలకు, శ్మశాన వాటికకు నడుమ కూకట్పల్లి నాలా ఉంది. ఒకప్పుడు 60 అడుగు లతో పరికి చెరువు నుంచి ప్రవహించే నాలా ప్రస్తుతం కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకు ని 20 అడుగులకు కుంచించుకుపోయిందని దయార్‌గూడ నివాసులు పేర్కొంటున్నారు. నాలా పక్కనే ఉన్న పరిశ్రమ దారులు నాలాను మట్టితో పూడ్చుతూ పోవడంవల్ల, నాలా పరి మాణం తగ్గి వర్షాలు పడ్డప్పుడు వరదలు ఎక్కు వగా రావడంతో శ్మశాన వాటికలోని సమాధులు వరదల్లో కొట్టుకుపోయాయని, ఆక్రమణ దారు లు తమ ఆస్తులు పెంచుకోవడం కోసం సమా ధులను కూడా వదలడం లేదని ఇక్కడి వారు అంటున్నారు.
అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం
శ్మశాన వాటికలో సౌకర్యాలు మెరుగుపర చడం కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కష్ణా రావు రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారని కూకట్పల్లి నియోజకవర్గ ఎస్సీసెల్ వి భాగం అధ్యక్షుడు బొట్టువిష్ణు తెలిపారు. అందు లో భాగంగా శ్మశాన వాటిక కమాన్ నూతనంగా నిర్మించడంతో పాటు, ఆప్తులను కోల్పోయి బాధలో ఉండే బంధువులకు అంత్యక్రియల సమ యాల్లో కూర్చోడానికి షెడ్ నిర్మిస్తూ, శ్మశాన వాటి కను, ఎమ్మెల్యే కష్ణరావు సహకారంతో అభివద్ధి పరుస్తున్నామని బొట్టు విష్ణు తెలిపారు.
నాలా ఆక్రమణ అడ్డుకోవాలని వినతి
2016 సంవత్సరంలొనే నాలా పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చి వేసినప్పటికి, భూదాహం తీరని పారిశ్రామిక వేత్త మళ్లీ నాలా బఫర్ జోన ్లో షెడ్డు నిర్మించి సమాధులు వరదల్లో కొటు ్టకుపోయే పరిస్థితికి కారణమవుతున్నారని, నాలాను పూడ్చుతూ శ్మశాన వాటికకు హద్దులు చేరిపేస్తున్నారని, ఇటువంటి కబ్జాదారులను అడ్డుకోవాలని దాయార్గూడ వాసులు కోరుతు న్నారు. నాలా చుట్టూ రక్షణ గోడను నిర్మించి నా లాను రక్షించాలని కూకట్ పల్లిజోనల్ కమిషనర్ వి. మమతకు వినతిపత్రం కూడా అందజేశారు.
కబ్జా కొనసాగుతోంది
నాలా అంచుపోంటి రూ ల్స్‌కు భిన్నంగా పరిశ్రమలు నిర్మించుకోవడమేగాక, పారి శ్రామిక వ్యర్ధాలు కాలువలో వేస్తూ.. కాలువను పూడ్చి మరి ంత జాగాను కబ్జాచేసే ప్రయ త్నం జరుగుతోంది.
బచ్చలి శ్రీనివాస్, స్థానికుడు
అధికారులు చర్యలు తీసుకోవాలి
పరిశ్రమల్లోని కాలుష్య జలా లు, వ్యర్థాలను కాలువలో కలిపి పూర్తిగా కలుషితం చేసున్నరు. దీనిపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.
బాపన్‌పల్లి మహేందర్, స్థానికుడు