Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొ న్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డికి సీపీఐ(ఎం) బాలాపూర్ మండల బాధ్యులు అశోక్, బడంగ్పేట్ కార్పొరేషన్ కమిటీ నాయకులు జి.వేణు మాధవరావు, భరత్ శుక్రవారం వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలను గాలికి వదిలే యొద్దనీ, పరిష్కరించాలని కోరారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారనీ, అందుకోసం ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీల్లో పొంగుతున్న డ్రయినేజీలను గుర్తించి కొత్తవి నిర్మించాలన్నారు. అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ మీదు గా నాదర్గుల్ వరకు, అల్మాస్ గూడ నుంచి గుర్రంగూడ వరకు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. వరుద నీటి ప్రమాదం నుంచి ప్రజలను కాపాడ టానికి ట్రంకులైన్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. మీర్పేట్ నుంచి రాజీవ్ గృహకల్ప రోడ్డుపై కొన్ని చోట్ల ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయటంతో పాటు, చెరువుల సుందరీకరణ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని వినతిలో కోరారు. వినతిపపత్రం అంద జేసిన వారిలో నాయకులు దామోదర్, సుధాకర్, మహే ందర్, నర్సిహులు, తదితరులు పాల్గొన్నారు.