Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అల్పాదాయ వర్గాలకే హౌసింగ్ బోర్డు ఇండ్లు కేటాయి ంచాలని వామ పక్షపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కేపీహెచ్‌బీకాలనీ హిందూ ప్రాజెక్టును వద్ద సీపీఐ, సీపీఐ(ఎం), వామపక్ష పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో 15 జాయింట్ వెంచర్లకు భూము లను కేటాయించారని గుర్తు చేశారు. 4వ ఫేజ్‌లో హిందూ ప్రాజెక్టు వారికి 70 ఎకరాలు కేటాయించి అల్పాదాయ వర్గా ల వారికి 788 ప్లాట్స్ 470 లెంత్ ఏరియాతో హిందూ ప్రాజెక్టు నిర్మించి హౌసింగ్ బోర్డు వారికి అందజేయాలని 15 ఏండ్లు గడిచినా నేటికీ ప్లాట్సు పూర్తి కాలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఒక స్క్వెర్ ఫీట్ ధర రూ. 1800గా నిర్ణయించి న్యూస్‌పేపర్ ద్వారా డిమాండ్ సర్వే జరిపి రిజర్వేషన్లు అమలు చేస్తూ బకాయిలు చెల్లించుటకు వాయిదా పద్దతిలో స్కీంలు ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని డిమాండ్ చేశారు. రామ్‌కి ప్రాజెక్టు హైటెక్ సిటీ సమీపంలో 96 ప్లాట్సు రెడీగా ఉన్నా యనీ, వాటిని కూడా డిమాండ్ సర్వే జరిపి అమలు చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శివప్ర సాద్, సీపీఐ(ఎం) నాయకులు ఎం.శంకర్, కె.కృష్ణనాయక్, ఎం.చంద్రశేఖర్, బాలు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.