Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూన్ 25 తేదీ వచ్చినా మే నెల జీతం ఇంతవరకు చెల్లించలేదని, గత సంవత్సరం ఆరు నెలలు నుండి ఉద్యో గుల జీతాలు ఏ నెలలో కూడ సక్రమంగా చెల్లించలేదని ఉద్యోగసంఘాలు తెలిపాయి. 80,000 వేల మంది ఉద్యోగులు విఆర్ఎస్ క్రింద రిటైర్ అయ్యారని, కంపెనీ జీతాల ఖర్చు 50% పైగా తగ్గిందన్నారు. ఆదాయము గత ంలో మాదిరిగానే వస్తున్నా ఉద్యోగులకు జీతాలు సకా లంలో చెల్లించటంలో బిఎస్ఎన్ఎల్ మేనేజిమెంట్ పూర్తిగా విఫలమైందన్నారు. జీతాలు చెల్లించే అంశాన్ని చివరి ప్రాధాన్యతగా పరిగణించుతుందని, ఇలాంటి మేనేజిమెం టు వైఖరిని ఉద్యోగసంఘాలన్ని ఖండిస్తున్నాయని తెలి పారు. మే నెల జీతం వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో గడువు తేదినే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బి ఎస్ ఎన్ ఎల్ ( ఏ యు ఏ బి) ఇచ్చిన పిలుపును, తెలంగాణ సర్కిల్లో అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసుల ము ందు, ఛీఫ్ జనరల్ మేనేజర్ ఆఫీసు, హైదరాబాద్ ముం దు భోజన విరామ సమయంలో మేనేజిమెంటు వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించారు. శుక్రవా రం నిర్వహించిన ప్రదర్శనలలో తెలంగాణలో బీఎస్ఎన ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, యన్యఫ్టిఇ, ఏఐజిఇట ిఓఏ, యస్యన్ఈఏ, ఏఐబిఎస్ ఎన్ఎల్ఈఏ, యస్ సి/యస్ టి ఉద్యోగుల అసోసియేషన్, యఫ్యన్టిఓ, బిఎస్ఎన్ ఎల్ఏటియమ్ సంఘాలు, అసోసియేషన్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ఇయూ నుంచి కా.జి.సాంబశివరావు, ఓం ప్రకాశ్ జైశ్వాల్ , ఎన్ఎ ఫ్టీఇ నుంచి కా. రాజమౌళి, ఏఐజీఇటీఓఏ నుంచి నుండి కా వీరభద్రరావు, ఎస్ఎన్ఈఏ నుంచి కా.సురేషకుమార్, ఎస్సీఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నుండి కా.రాజారామ్, ఇప్ఎన్టీఓ నుంచి కా.రఫీక్ పాల్గొని ప్రసంగించినారు. ప్రదర్శనలలో బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు కు మరియు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.