Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి బి.ప్రదీప్
- విద్యానగర్ మార్క్స్ భవన్లో సమావేశం
నవతెలంగాణ-అడిక్మెట్
మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఐఎఫ్టీయూ జాతీయ కార్య దర్శి బి.ప్రదీప్ అన్నారు. శుక్రవారం విద్యానగర్ మార్క్స్ భవన్లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రకటిత ఎమ ర్జెన్సీని తలపించే పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమిం చాలని పిలుపునిస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రదీప్, ఐఎఫ్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్ పద్మ, రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కె.సూర్యం హాజరయ్యారు అనంతరం వారు మాట్లా డుతూ దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 ఏండ్లు అవుతుంద న్నారు. ఆనాడు ప్రజాస్వామిక హక్కులను ఇందిరాగాంధీ ప్రభుత్వం కాలరాసిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష, పౌరహ క్కుల నాయకులను విప్లవకారులను జైలు పాలు చేసి పొట్టనపెట్టుకుందని తెలిపారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే విధానాలను అవలంభిస్తునందని తెలిపారు. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని తలపించిన పరిస్థితులకు వ్యతిరే కంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధానాలను అవలంభి స్తారనీ, కార్మికులను మరింత శ్రమదోపిడీ చేసే విధానాల ను అనుసరిస్తోందని విమర్శించారు. కార్మికులు ఉపాధి కోల్పోయి జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే నిత్యావ సర ధరలు పెంచి వారి నడ్డి విరుస్తున్నారని విమర్శిం చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వైద్య సౌకర్యాలు అందించకపోవడం సిగ్గు చేటన్నారు.