Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రభుత్వం పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేసి హాస్టల్స్‌ను పున:ప్రారంభించిన తరువాతే తరగతులను నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు గోలి హరికష్ణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకష్ణ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గ్యార నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో విద్యాలయాలు పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా, హాస్టల్స్ రీ ఓపెన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లక్షలాది మంది విద్యార్థులు వివిధ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించి హాస్టల్స్‌ను రీ ఓపెన్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు సయ్యద్ వల్లీ ఉల్లా ఖాద్రీ, నగర నాయకులు రఘు, విప్లవ్, నవీన్, శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు.