Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్
నవతెలంగాణ-ధూల్‌పేట్
జూలై 1 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ అధికారులను ఆదేశించారు. హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమం, యాంటీ లార్వా ఆపరేషన్, పురాతన భవనాల కూల్చివేత, నాలాల అభివద్ధి, పారిశుధ్యం, మూత్రశాలల నిర్వహణ, బోనాల ఉత్సవాల పై శుక్రవారం సాయంత్రం చాంద్రాయణ గుట్ట నరికీ పూల్ బాగ్‌లోని జోనల్ కార్యాలయంలో డీసీలు, పలు విభాగల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిళ్ల వారీగా అన్ని ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో 10 లక్షల 65 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పలు విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలను అరికట్టేందుకు ప్రతి రోజు యాంటీ లార్వా ఆపరేషన్, యాదాద్రి మాదిరిగా మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్నా పురాతన భవనాలకు నోటీసులు జారీచేసి ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపడతామన్నారు. బోనాల ఉత్సవాలకు అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ డాకు నాయక్, డిప్యూటీ కమిషనర్లు రజనీకాంత్ రెడ్డి, అలివేలు మంగతాయారు, సూర్య కుమార్, రాజేందర్ రెడ్డి, జగన్, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ నాగిరెడ్డి, ఈఈలు కిష్టప్ప, లక్ష్మ, రాధికా, రాములు, రవాణా విభాగం డీసీటీఓ వినరు భూషణ్, జోనల్ కమిషనర్ సీసీ గుంటు గిరి బాబు తదితరులు పాల్గొన్నారు.