Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
'కరోనాను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండేందుకు మనముందు ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. ఇంట్లోని ప్రతి సభ్యునికి వ్యాక్సిన్ వేయాలనేది ప్రభుత్వం ఆలోచన' అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి సర్కిల్ బాలానగర్, ఫతేనగర్ జంట సర్కిళ్ల పరిధిలో ప్రతి సర్కిల్ వారీగా ఉన్న ప్రజలకు వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం వేసేందుకు నడుం బిగించిందన్నారు. ఫతేనగర్ డివిజన్ భగత్ సింగ్ పార్క్‌లో కొనసాగుతున్న వాక్సినేషన్ సెంటర్‌ను శుక్రవారం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ పరిశీలించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మొదటిరోజు 535 మందికి, రెండో రోజు 890 మందికి, మూడోరోజు 1200 మందికి వ్యాక్సినేషన్ అందించామని తెలిపారు. భగత్ సింగ్ పార్క్‌లో ఈనెల 30 వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ఈఅవకాశాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రహిత డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బిక్షపతి, రాము ముదిరాజ్, కుమారి శిల్ప అంజలి యాది పాల్గొన్నారు
బాలానగర్ డివిజన్లో..
బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ ఆర్కే గార్డెన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండొచ్చన్న నిపుణుల సూచనలతో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోందని, వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, డాక్టర్ చందర్, ఎమ్హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, జీహెచ్ఎంసీ సిబ్బంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్, నాయకులు మందడి సుధాకర్ రెడ్డి, మొహమ్మద్ ఖాజా, ఎలిజల యాదగిరి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ మోసిన్, జమీల్, సలీం నాయకులు కరిముల్లా, మొహమ్మద్ ఫారూఖ్, సంపత్, ఆంజనేయులు పాల్గొన్నారు.