Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇన్చార్జి నాగురావు నామోజీ అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నామాల గుండులోని ఫంక్షన్ హాల్లో బీజేపీ మహంకాళి జిల్లా నేతల సమావేశం జరిగింది. పెద్దఎత్తున ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హాజరై ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము చేసిన పోరాటాలు, త్యాగాలు, అనుభవాలను, జైల్ జీవితం గురించి వివరించారు. ముఖ్య అతిథిగా నగురావు నామోజీ, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు హాజరై మాట్లాడుతూ ఇందిరాగాంధీ అప్రజాస్వామిక పరిపాలనను, అక్రమాలను వ్యతిరేకించిన వారిని అన్యాయంగా జైల్ లో పెట్టారని తెలిపారు. అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎంతోమంది యోధులు తమ ప్రాణాలను తణపాయంగా వదిలారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామసుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగాపాని, పెద్ది రవీందర్, శంకర్, బండ కార్తీక రెడ్డి, బండపల్లి సతీష్ గౌడ్, వెంకట రమణి, కష్ణ మూర్తి, ప్రభుగుప్త, కనకట్ల హరి, ప్రకాష్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాజు, రాము వర్మ, హనుమంతు,శ్రీధర్, మల్లేష్, కార్పొరేటర్లు సరళ, కొంతం దీపికా, చీర సూచిత్ర, భాస్కర్ గిరి, బీజేవైఎం అధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి రుద్రగాని సందీప్, కన్నబిరామ్, దత్తు, నీలం శ్రీనివాస్ పాల్గొన్నారు.