Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఉద్యోగుల యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పట్ల ముఖ్యంగా పదకొండవ పీిఆర్సి ప్రకారం పారిశుధ్య కార్మికులకు జీతాలు అమలు పరచాలని సీఐటీయు నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు అనేక అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే సందర్భంలో ప్రగతినగర్లో శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పట్ల పరిష్కారం కావాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశధ్య కార్మికులకు కనీస వేతనం నెలకు 19వేల రూపాయలు నిర్ణయించాలని సీఐటీయు డిమాండ్ చేస్తున్నప్పటికీ, 11వ పీిఆర్సి అమలులో భాగంగా ప్రభుత్వం జీవో 60 ప్రకారం పారిశధ్య కార్మికులకు నెలకు 15వేల ఆరు వందలు నిర్ణయించి చేతులు దులుపుకుంది అని, చాలా దురదష్ట కరమని ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు అని గుర్తుచేశారు. అందువల్ల కార్మికులకు కనీస వేతనం 19వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రతి ఏడాది ఇవ్వాల్సిన యూనిఫామ్, చెప్పులు, కొబ్బరి నూనె, చీపుర్లు, సబ్బులు సకాలంలో అందించాలని విన్నవించారు. కార్మికులకు వారాంతపు సెలవులు లేకుండా వేట్టి చాకిరీ చేయిస్తున్నారని దానిపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వేతనాల్లో కోతలు కూడా ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నారని, కార్మికులు సెలవులు పెట్టుకున్న, లేకున్నా వేతనాల్లో కోత విధిస్తున్నారని, ఇదేమని అడిగితే అధికారుల వేధింపులకు గురికావాల్సి వస్తుందన్నారు. గతంలో మాదిరిగానే ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు ఎక్కువ శాతం మంది దళిత అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన వారనీ అర్హులైన పేదలకు, కార్మికులందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ నీలా గోపాల్ రెడ్డికి, కార్పొరేటర్లు శ్రీరాములు, బి వెంకట రామయ్య, లక్ష్మీ కుమారి గార్లకు కార్మికుల సమస్యల పట్ల విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు పీ.పెంటయ్య ఎన్.ఎల్లమ్మ, లింగమ్మ మన్నెం జైపాల్ వాణి స్వాతి బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.