Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని జెడ్.ప్ రోడ్లో బీజేపీ డివిజన్ ఆధ్యక్షులు
పి. నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అంతం అవినీతి పంతం అనే నినాదం తో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంతే కాకుండా డివిజన్లో ఎక్కడ అయినా సమస్యలు ఉంటే వాటిని దశలవారీగా పరిష్కరించే విధంగా బీజేపీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించామని వారు తెలిపారు. డివిజన్లో ఇప్పటికీి అనేకచోట్ల టీఆర్ఎస్ నాయకులు అధికార దాహంతో అభివద్ధి పనులు నిర్వహిస్తున్న బానోతు కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్‌కు విరుధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని, అక్రమంగా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పనులకు డివిజన్ బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. డివిజన్లో ఎక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టినా స్థానిక టీిఆర్‌ఎస్ నేతలు అక్కడ వాలిపోయి అధికార దాహంతో బలవంతపు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. గెలిచిన బీజేపీ కార్పొరేటర్ని కాదని డివిజన్లో ఉన్న టీిఆర్‌ఎస్ నాయకులు డివిజన్లో అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమిరెడ్డి, అమరేందర్ రెడ్డి రాజు గౌడ్, రాధాకష్ణ, మల్లేష్ గౌడ్, ఆమర్నాథ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి సంకల్ప శుక్ల, మధు, కె .శివా రెడ్డిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.