Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉత్తరాది పార్టీల పరిపాలనలో అన్ని రంగాల్లో దగాపడుతున్న దక్షిణాది ప్రాంతం హక్కులు ఆత్మగౌరవ ఉద్యమంలో కవులు, కళాకారులు భాగస్వామ్యం కావాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, చినుకు కల్చరల్ సొసైటీ అధ్యక్షులు లయన్ డాక్టర్ ఏ విజరు కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని మినీ సెమినార్ హాల్లో దక్షిణ భారత సాహితీ సాంస్కతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా శత కవి కవనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు బడుగు బలహీన వర్గాలకు భూమితోపాటు గురుకుల పాఠశాలలు వారి అభివద్ధి కోసం ఫైనాన్స్ పురుషులు హక్కుల పరిరక్షణ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దక్షిణ భారతీయుడు అయినందువలన అడుగడుగున వివక్షతను ఎదుర్కొని భారతదేశాన్ని ఆర్థిక, సాంకేతిక రంగంలో అభివద్ధి పథంలో నడిపించాడన్నారు. దక్షిణ భారత మహనీయులైన మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణగురు, ఎన్టీ రామారావు, పీవీ నరసింహారావు, వీరి అందరికి భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని, దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచ్‌తో పాటు యుపిఎస్సి దక్షిణాది అభివద్ధి మండలి భాషామండలి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత దక్షిణ భారత సాహితీ సాంస్కతిక సమాఖ్య కన్వీనర్ మూర్తి నిర్వహించగా, గౌరవ విశిష్ట అతిథిగా లయన్ శ్రీ రామ్ కత్తి, గౌరవ అతిథిగా డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా, ప్రత్యేక అతిథిగా లెజెండ్ బి మనీ మంజరి సాగర్, వందమంది కవులు పీవీ నరసింహారావు కషి పై కవితలు రాయగా కళాకారులు పాటలు పాడారు.