Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దళితుల ఆత్మగౌరవనికి దోహదం చేసేది భూమి కాబట్టి కేసీఆర్ దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇవ్వాలని ఓయూ బహుజన విద్యార్థి సంఘాల డిమాండు చేశారు. దళితులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద భూమి లేకపోతే మరి వందల, వేల ఎకరాల భూమి అమ్మడానికి, ప్రయివేటు సంస్థలకు ఇవ్వడానికి ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏడున్నర సంవత్స రాలు కావస్తుంది. బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఆశలను, కలలని, వారి జీవితాలని ఛిద్రం చేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితుల జీవితాలు కొంత మెరుగుగా ఉండేవి, ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కాబడిందో అప్పటి నుండి దళితుల సాధికారత లేదా అభివద్ధి అనేది అంత కంతకూ దిగజారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు దళితుల అభివద్ధి కొరకు టీఆర్ఎస్్ పార్టీ మ్యాని ఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. భూమి లేని నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న హామీ అమలు చేయలేదన్నారు.
దళితులకు నాణ్యమైన విద్యను కేజీ నుండి పిజి వరకు అందించాలి అని ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజరు, పులిగంటి వేణుగోపాల్, కొత్తపల్లి తిరుపతి, సునీల్ శెట్టి, అంబేడ్కర్, చంద్,రాజు, రవి,సంతోష్, కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.