Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్‌పల్లిలోని వైఎస్ఆర్ షర్మిల పార్టీ కార్యాలయం లో షర్మిల పార్టీ మహిళా నాయకురాలు పావని, ప్రభాకర్, అరుణ్‌రాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందని, కేజి టు పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని మాట తప్పారని, ప్రజాసేవకై అంకితమై ప్రజల మన్ననలు పొందిన మన మధ్యలో లేని మహా నేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై రాజకీయం చేయడం మంచిది కాదని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే పేదలపాలిట పెన్నిధి. అదేవిధంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతోమందికి ఉపకారం అందించిన నేత అని, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, పేద ప్రజలకు పక్కా ఇండ్లు అందించిన గర్వించదగ్గ గొప్ప నేత అని, కానీ నేడు రాజకీయ నాయకులు వైయస్ఆర్సీపీ షర్మిల పార్టీకి భయపడి షర్మిల పార్టీ ఎక్కడ గెలుస్తుందోనని భయంతోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు సిగ్గుచేటని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా బుద్ధి చెపుతామని హెచ్చరించారు. అలాగే రాబోయే ఎన్నికలలో షర్మిలమ్మ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.