Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శనివారం ఒక్కరోజే 34 నేలమట్టం
- సిటీలో 563 బిల్డింగ్లు పడావు
- ప్రజలు సహకరించాలి : కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసిన విషయం తెలి సిందే. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాలు, నిర్మాణాలను గుర్తించేందుకు టౌన్‌ప్లానింగ్, ఇం జినీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టా రు. ఈ సర్వేలో 563 శిథిలావస్థ భవనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిలో 138 భవనాలు కూల్చివేసిన, మరమత్తులు చేస ిన జాబితాలో ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 30 సర్కిళ్ల పరిధిలో 34 భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే 2020లో 231 శిథిలావస్థ భవనాలను కూల్చేశారు. మరో 129 భవనాలకు మరమత్తులు చేశారు. 215 భవనాలను ఈ ఏడాదిలో సర్వే చేశారు. వర్షాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాల సర్వే, కూల్చివే తలు, మరమత్తులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ షురూ అయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ స్థాయి అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. పాత భవనాల విషయంలో జీహెచ్ఎం సీ తీసుకునే చర్యలపై నగరవాసులు సహకరిం చాలని కోరారు.