Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
- అయోధ్యనగర్‌లో పర్యటన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శని వారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్‌లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ఎలక్ట్రిసిటీి, జలమండలి అధికారులతో కలిసి పర్యటిం చారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా కల్వర్టును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా కల్వర్టు వరకు చేపడుతున్న సీసీ రోడ్డుకు మధ్య కరెంటు స్తంభాలు అడ్డురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి సుచిత్ర నుంచి కుత్బు ల్లాపూర్ వరకు మంజూరైన రూ.44 లక్షల నిధుల నుంచి విద్యుత్ స్తంభాలు రోడ్డు మధ్యకు తొలగించాలన్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, ఏఈ సురేందర్ నాయక్, జలమండలి డీజీఎం రాజేష్, డీఈ రఘుపతిరెడ్డి, బస్తీ అధ్యక్షులు యేసు, నదీంరారు, వార్డు సభ్యురాలు ఇందిరారెడ్డి, రాజ్‌కుమార్, సత్యనారాయణ, ఉమేష్‌సింగ్, కృపాల్యాదవ్, లింగం, యాకయ్య, ముకుందం, యాద గిరి, కనకయ్య, సోమయ్య, రమేష్ పాల్గొన్నారు.