Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రీయ బాల శ్వస్త్ కార్యక్రమ (ఆర్బీఎస్కె) అద్దె వాహనాల నెలసరి అద్దెను పెంచాలని ఆర్బీఎస్కె మొబైల్ హెల్త్ టీం వెహికల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షులు తాళ్లపల్లి బాలయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేర కు శనివారం ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో ఆర్బీఎస్కే వాహనాలు ప్రతి జిల్లాలో నడుస్తున్నా యని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 వాహనాలు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు వైద్య సేవలు అంద చేసే క్రమంలో వాహనాలను నడిపామన్నారు. ( ఆర్ బి ఎస్ కె) మొబైల్ హెల్త్ టీం వెహికల్ డ్రైవర్లు కరోనా కష్ట కాలంలో అలుపెరుగని సేవ చేశారనేది ప్రభుత్వానికి కూడా తెలుసునని పేర్కొన్నారు. 2016లో మొదలైన ఈ కార్యక్రమంలో వాహనాలను రూ.20 వేలకు ఇస్తారని తెలిపారు. అప్పట్లో డీజిల్ ధరలు రూ.52 ఉండేవనీ, ఇప్పు డు రూ.97లకు చేరుకోవడం వల్ల వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వం వారికి కేవలం రూ.34 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా రూ.42 వేలకు అద్దె వాహ నాల బిల్లులను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవ ర్లకు వాహనాలు అద్దెను గతంలో మాదిరిగా ఐదు నెలలకు ఒకసారి కాకుండా నెలనెలా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరి ంచాలని ఆరోగ్యశాఖ కమిషనర్ కరుణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ లను కలిసి తన ఇబ్బందులను తెలియజేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాహనాల అద్దెలను పెం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చంద్రశేఖర్, నారగోని జగన్, మల్లేష్, స్వామిగౌడ్, బాల్రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.