Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
నాచారం డివిజన్లోని పటేల్‌కుంట చెరువు, హెచ్ఎ ంటీ నగర్ చెరువులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ప్రవాహం సరైన మార్గంలో ప్రవహించేందుకు పటేల్‌కుంట చెరువు వద్ద నిర్మిస్తున్న కల్వర్టులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. అలాగే హెచ్ఎంటీ నగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియ, సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో నీటి శుద్ధీకరణ పరిశీలన, హెచ్ఎంటీ చెరువులో గుర్రం డెక్క తొలగించిన అనంతరం బేబీ పాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ, గణేష్ నిమజ్జనంలకు ఉపయోగించుకోవాలని అన్నారు. హెచ్ఎ ంటీ చెరువు చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, లేక్ బ్యూటిఫికేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచిం చిన ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులకు ఒక్కొక్కరికి పర స్పర సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కాప్రా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, ఏఎంఓహెచ్ మైత్రేయి, డీఈ రూపా, ఏఈ రాకేష్, జలమండలి జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్, డీజీఎం కృష్ణ, ఏఈ. సాయిబాబా, ఎస్ టీపీడీజీఎం నగేష్, మేనేజర్ భాను చంద్రర్, ఎంటమాలజీ ఎస్ఈ రజిని, ఏఈ నరేష ్రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి ఈ పవన్, ఏఈ పృథ్వీ, టీఆర్ఎస్ నాయకులు సాయి జైన్శేఖర్, గరిక సుధాకర్, ముత్యంరెడ్డి, కట్ట బుచ్చన్నగౌడ్, శ్రీరామ్ సత్యనారాయణ, రామ్‌చందర్, అంజి, రమేష్, రాజు, శివకుమార్, కర్ణ, శంకర్, హరి ప్రసాద్, బాలామణి, కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.